calender_icon.png 25 November, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి

25-11-2025 04:59:02 PM

మంథనిలో రిటైర్డ్ ప్రిన్సిపల్ అంబరీష్..

మంథని (విజయక్రాంతి): నేటి ఆధునిక కాలంలో సాంకేతిక విద్యను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని రిటైర్డ్ ప్రిన్సిపాల్ అంబరీష్ అన్నారు. మంగళవారం మంథనిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో దాతలు అందజేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈ కళాశాలలోనే ప్రిన్సిపల్ గా పనిచేసి పదవి విరమణ పొందాలని, తాను చిట్టచివరిసారిగా పనిచేసిన కళాశాలకు ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో దాతలను సంప్రదించగా పది కంప్యూటర్లను అందజేశారన్నారు.

వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని సాంకేతిక రంగంలో దూసుకెళ్లాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ సలీం మాట్లాడుతూ తన గురువు గారైన అంబరీష్ విద్యార్థిలకు ఎంతో ఉపయోగకరమైన కంప్యూటర్లను అందించడంలో కీలక భూమిక పోషించారన్నరు. తమ కళాశాలకు కంప్యూటర్లు అందజేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీరామబట్ల అనిరుద్, వ్యాపారవేత్త వడివేల్ సేవాచి, టెక్నికల్ ఇంజనీర్ ప్రశాంత్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.