calender_icon.png 9 November, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వల్లే దేశం అభివృద్ధి బాటలో పయనించింది

31-07-2024 04:22:16 PM

హైదరాబాద్: పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఘోరంగా తయారు చేసిందని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లే దేశం అభివృద్ధి బాటలో పయనించిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల రుణాలు తీసుకుందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.70 వేల కోట్ల అప్పు ఉందని, బీఆర్ఎస్ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసినట్లు కేటీఆర్ ఒప్పుకున్నారని, ఆ పైసలు ఎక్కడ ఖర్చు పెట్టారో బీఆర్ఎస్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతు పంటల రుణమాఫీ అమలు చేస్తున్నామని వివేక్ చెప్పారు.

ఇప్పటి వరకు రూ.1.50 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేశాం, ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షలు రుణమాఫీని కచ్చితంగా అమలు చేసీ తీరుతామన్నారు. గతంలో అనర్హులకు కూడా రైతుబంధులో ప్రయోజనం చేకూర్చారని, కౌలు రైతులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానిదని వివేక్ చెప్పారు. కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు కూడా రూ.2 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా కూడా అమలు చేస్తుందని గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుంది. సబితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు.