టిఫిన్ సెంటర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: ముగ్గురు మృతి
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లిలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు మొబైల్ టిఫిన్ సెంటర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. రఘునాథపల్లిలో నేషనల్ హైవేపై హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో అతివేగంతో వచ్చిన అదుపుతప్పిన ఆర్టీసీ గరుడ బస్సు మొబైల్ టిఫిన్ సెంటర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడే టిఫిన్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షగతాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పతికి తరలించారు. గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.




