ఊడేనా.. ఉండేనా?
- 37 నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ..
- సందిగ్ధంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు
- ఆశావవుల ఎదురుచూపు
రంగారెడ్డి, అక్టోబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు, యువజన విభాగాల ప్రతినిధులకు సామాజిక సమీకరణల ఆధారంగా ప్రభుత్వం 37 నామినేటెడ్ కార్పొరే షన్ చైర్మన్ పదవులను(Nominated Corporation Chairman Positions) కేటాయించింది. అయితే, ప్రస్తుతం తమ పదవీకాలం ముగిసినప్పటికీ రెన్యువల్ జీవోలు విడుదల కాక పోవడంతో సదరు మాజీ చైర్మన్ల భవిష్యత్తు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి‘లా తయారైంది. ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో తాము అధికారంలో ఉన్నామా లేదా అనే ఆందోళన వారిని వేధిస్తోంది.
ఐఏఎస్ ససేమిరా....నిలిచిపోయిన ఫైళ్లు....
ప్రస్తుతం ఆయా శాఖల కార్పొరేషన్ పరిధిలో ఎలాంటిజీవోలు లేకపోవడంతో కా ర్పొరేషన్ కార్యాలయాల్లో చైర్మన్లు ఇబ్బందికర పరిస్థితులనుఎదుర్కొంటున్నారు. అధికా రిక రెన్యువల్ ఉత్తర్వులు లేకుండా ఫైళ్లపై సంతకాలు తీసుకోలేమని, ఏ విధమైన నిర్ణయాలను ఆమోదించలేమని సీనియర్ ఐఏఎస్ అధికారులు, సీఈఓలు, కలెక్టర్లు స్పష్టం చేశారు. దీంతో 37 కార్పొరేషన్లకు సంబంధించిన కీలక ఫైళ్లు, పాలనాపరమైన నిర్ణయాలు స్తంభించిపోయాయి.
అధికారిక గడువు ముగియడం, ప్రోటోకాల్ చెల్లకపోవడంతో శాఖాపరంగా కేటాయించిన కాన్వాయ్ వాహనాలు, వ్యక్తిగత సిబ్బందిని వెనక్కి తీసుకునేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. జీవోలు లేకుండా ఆఫీసులకు వెళ్లి అవమానపడటం కంటే ఇళ్లకే పరిమితమవ్వడం సగానికి పైగా నేతలు భావిస్తుండగా, కొందరు మాత్రం మౌఖిక హామీలను నమ్ముకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పనితీరు ఆధారంగానే పొడిగింపు.. నివేదికల వడపోత
సీఎంఓ వర్గాల సమాచారం ప్రకారం, పాత ముఖాల్లో మెజార్టీ నేతలకు రెన్యువల్ దక్కడం కష్టమేనని తెలుస్తోంది. గడిచిన కాలంలో చైర్మన్ల పనితీరు, వివాదాలు, ఆరోపణలపై ఇంటెలిజెన్స్, పార్టీ వర్గాల నుంచి సర్కార్ నివేదికలు తెప్పించుకుంది. 37 మందిలో కేవలం 4 నుంచి 6 మంది క్రియాశీలక నేతలకు మాత్రమే రెండో అవకాశం దక్కే అవకాశముంది. ఇప్పటికే చైర్మన్ వెంకట్రామిరెడ్డి, నేరెళ్ల శారదలకు పదవులు కేటాయించగా, నేరెళ్ల శారదకు రెండోసారి పొడిగింపు లభించింది.
కొత్త ఆశావహుల ఒత్తిడి......
అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి త్యాగం చేసిన సీనియర్లు, యువజన నేతలు నామినేటెడ్ పదవులపై గంపేడు ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి మండవ వెంకటేశ్వరరావు, ఆకుల లలిత, ధర్మపురి సంజయ్,ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఇందిరా శోభన్, బొజ్జ సంధ్యారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి, ఠాకూర్ బాలాజీ సింగ్,రంగారెడ్డి నుంచి భీమ్ భరత్,
తీగల అనిత రెడ్డి, దేపా భాస్కర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ కోట లో జక్కిడి శివ చరణ్ రెడ్డి, పాలకూర్ల రవికాంత్ గౌడ్ వీరికి అవకాశం కల్పించాలంటే పాతవారిని తప్పించక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న, గడువు ముగిసిన దాదాపు 60కి పైగా నామినేటెడ్ పోస్టులను ఒకే జాబితా ద్వారా భర్తీ చేసేందుకు టీపీసీసీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.
37 మంది కార్పొరేషన్ చైర్మన్లు వీరే....టి. నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ,మల్రెడ్డి రామ్రెడ్డి తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ,పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్,కె. శివసేనారెడ్డి స్పోరట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ,ఆర్. గురునాథ్ రెడ్డి -తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్,పోడెం వీరయ్య తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ,ఈరవత్రి అనిల్ తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ,
నేరెళ్ల శారద తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ , శోభారాణి మహిళా సహకార అభివృద్ధి సంస్థ,ఎన్. ప్రీతమ్ తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్,నూతి శ్రీకాంత్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్,బెల్లయ్య నాయక్ గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ, కోతాకు నాగు ఎస్టీ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్,ఎస్. అన్వేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ,కాసుల బాలరాజు తెలంగాణ ఆగ్రోస్,
రాయల నాగేశ్వరరావు తెలంగాణ వేర్హౌసింగ్ కార్పొరేషన్,ఎం. విజయబాబు కో-ఆపరేటివ్ హౌసిం గ్ ఫెడరేషన్,మన్యం సతీష్ కుమార్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ,చల్లా నరసిం హారెడ్డి అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్,ఐతా ప్రకాష్ రెడ్డి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, ముహమ్మద్ రియాజ్ తెలంగాణ గ్రంథాలయ పరిషత్,ఎం. వీరయ్య తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ,
నాయుడు సత్యనారా యణ తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ,ఆలేఖ్య పుంజాల తెలంగాణ సంగీత నాటక అకాడమీ,ఎన్. గిరిధర్ రెడ్డి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్,జనక్ ప్రసాద్ కనీస వేతనాల సలహా మండలి,కల్వ సుజాత వైశ్య కార్పొరేషన్,జెరిపేటి జైపాల్ అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ ,ఎం.ఏ. ఫహీమ్ తెలంగాణ ఫుడ్స్ ,ఇ. వెంకట్రామిరెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ,కె. నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ,
సి.హెచ్. జగదీశ్వర్ రావు తెలంగాణ నీటిపారుదల అభివృద్ధి సంస్థ,జంగా రాఘవరెడ్డి తెలంగాణ నూనె గింజల ఉత్పత్తిదారుల ఫెడరేషన్ (ఆయిల్ ఫెడ్) ,మనాల మోహన్ రెడ్డి తెలం గాణ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ,జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ పాడి అభివృద్ధి సహకార ఫెడరేషన్ (విజయా డెయిరీ) ,మెట్టు సాయికుమార్ తెలంగాణ మత్స్యకారుల సహకార ఫెడరేషన్,ఎం.ఏ. జబ్బార్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ (వైస్ చైర్మన్)