2 June, 2026 | 1:18 AM

దేశంలోనే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షల ఆర్థిక సాయం

02-06-2026 12:45 AM

ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు 

సుల్తానాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లను అధికారులు,ప్రజాప్రతినిధులతో కలిసి తెలంగాణ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ...ఇండ్ల లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. .ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సర్పంచ్ పోచంపల్లి చిన్నయ్య , పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు హౌసింగ్ డీఈఈ,ఏఈ తదితరులు పాల్గొన్నారు.