2 June, 2026 | 1:14 AM

బీజీ కొత్తూరు అభివృద్ధికి సహకారం అందిస్తాం: మంత్రి తుమ్మల

02-06-2026 12:44 AM

అశ్వాపురం, జూన్ 1 (విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్టు పంప్హౌస్, కెనాల్ నిర్మాణం కోసం భూ సేకరణకు సహకరించిన బీ జీ కొత్తూరు గ్రామానికి రహదారి నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ మర్రి సంధ్య, మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి సోమవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పంప్హౌస్, కెనాల్ నిర్మాణానికి భూములు ఇచ్చి సహకరించిన గ్రామ ప్రజల త్యాగాలను ప్రభుత్వం ఎప్పటికీ మరువదని, మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, రైతు కొల్లు ఉప్పల్రెడ్డి సహా స్థానిక రైతాంగం చేసిన సహకారం అభినందనీయమన్నారు.

బీ జీ కొత్తూరు గ్రామ అభి వృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, రహదారి నిర్మాణం, మౌలిక సదు పాయాల కల్పన, అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి విజ్ఞప్తి మేరకు తుమ్మల చెరువు తూములు, షట్టర్లు, కాలువలను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.