1 August, 2026 | 6:59 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు

01-08-2026 05:58 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరి చేయడం జరిగిందని ఏఐసీసీ తెలంగాణ విచారి విభాగ్ కోఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ తెలిపారు. పబ్లిక్ స్కూల్ మంజూరి కోసం రాజ్యసభ సభ్యుడు వేం. నరేందర్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు. పార్లమెంటు సభ్యులు జి నగేష్ స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ మాజీ ఎంపీ సోయం బాపూరావు డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్లు వ్యూహాత్మకంగా మంజూరు కోసం సహకరించారన్నారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మంజూరు కి తన వంతు సహకారం అందించిన ముఖ్యమంత్రి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల మంజూరితో పేద విద్యార్థులకుఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నూతనంగా ఏర్పడిన మండలం అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.