09-12-2025 08:10:57 AM
హైదరాబాద్: గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)తో తొలిరోజు భారీగా పెట్టుబడులు వచ్చాయి. గ్లోబల్ సమ్మిట్(Global Summit) తొలిరోజు రూ. 3,97,500 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజు 35 కు పైగా ఎంవోయూలు జరిగాయి. బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ వెంచర్స్ రూ. 75 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. పునరుత్పాదక విద్యుత్, ఈవీ ఇన్ ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ రూ. 27 వేల కోట్లు పెట్టుబడి పెడుతోంది. సిడ్బీ స్టార్ట్ ప్ లకు రూ. వెయ్యి కోట్లో పెట్టుబడులతో ముందుకొచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు రూ, వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈవ్ రెన్ యాక్సెస్ ఎనర్జీ రూ. 31,500 కోట్లతో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ రూ. 8 వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది.
సోలార్, పంప్ డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులను మేఘా ఏర్పాటు చేయనుంది. ఏరో స్పేస్, డిఫెన్స్ రంగాల్లో జీఎంఆర్ గ్రూప్ రూ. 15 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. డిఫెన్స్, ఏవియానిక్స్ తయారీకి అపోల్ మైక్రో రూ. 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. డిస్ట్రిబ్యూషన్ హైడ్రోటెక్ రంగంలో సాహీటెక్ ఇండియా రూ, వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇంటిగ్రేటేడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృష్ణా పవర్ యుటిలిటీస్ రూ. 5 వేల కోట్లు పెట్టుబడి పెడుతోంది. సిమెంట్ రంగ విస్తరణ అల్ట్రాటెక్ సిమెంట్స్, రెయిన్ సిమెంట్స్ రూ. 2 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రూ. 3 వేల కోట్లతో టెక్స్ టైల్ యూనిట్ ఏర్పాటుకు సీతారామ్ స్పిన్నర్స్ ఒప్పందం చేసుకుంది. ఫిల్టర్స్ పవర్ లూమ్ టెక్నికల్ యూనిట్ కు రూ. 960 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో నేడు తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ విడుదల కానుంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేశారు. వెయ్యి మంది ప్రతినిధులకు విజన్ డాక్యుమెంట్ అందించేందుకు రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేసింది.