calender_icon.png 9 December, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించాలి

09-12-2025 02:41:29 AM

  1. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరిక
  2. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
  3. తెలంగాణ బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ
  4. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుంటే నిరాహార దీక్షలు
  5. హెచ్‌సీయూ విద్యార్థి నేత రాకేష్ దత్త

ముషీరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): పెండింగ్లో ఉన్న రూ. 10 వేల కోట్ల ఫీజు బకాయిలను చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమా డుతు న్నదని మాజీమంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తక్షణమే ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరిం చారు.

తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం రూ. 10 వేల కోట్ల విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 17న ఖమ్మం నుండి హైదరాబాద్ సెం ట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త చేపట్టిన 250 కిలోమీటర్ల మహా పాదయాత్ర హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా ముగింపు కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ముందు గా వై జంక్షన్ చౌరస్తాలో భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు నిధులు ఖర్చు చేసి సమ్మిట్లు, అందాల పోటీలు నిర్వహిస్తుంది తప్ప విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మా త్రం చెల్లించడం లేదని ఆయన మండిపడ్డారు. కాలేజీ యజమాన్యాలను ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తూ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేస్ మార్కులు కలపాలంటే యజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని మండిపడ్డారు.

విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కోసం భూములు, బంగారాన్ని అమ్ముకొని ఫీజులు కడుతుంటే ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ మాట్లాడుతూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌కు ఎక్కే విధంగా డ్రోన్లు వద్దు విద్యార్థులకు టాయిలెట్లు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బీసీ విద్యార్థి నేత రాకేష్ దత్త మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుకై ఖమ్మం నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు.  తెలంగాణ విద్యార్థి సంఘం రామకృష్ణ, విద్యార్థి సంఘాల నేతలు, గోనే శ్రీశ్రీ, పవన్ రాజేష్, వినయ్, జయంత్ యాదవ్ పాల్గొన్నారు.