18 July, 2026 | 3:28 PM

పీహెచ్‌సీ భవనానికి భూమిపూజ

18-07-2026 03:28 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): చింతలమనేపల్లి మండల కేంద్రంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవన నిర్మాణానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో కలిసి శనివారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నూతన పీహెచ్‌సీ భవనం నిర్మాణం పూర్తయిన అనంతరం మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,  నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.