20 August, 2026 | 3:17 AM

ఇటలీలో సత్తాచాటిన తెలంగాణ సెయిలర్లు

20-08-2026 01:05 AM

ముషీరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ఇటలీలోని లేక్‌గార్డాలో జరిగిన అంతర్జాతీయ క్యాడెట్ క్లాస్ అండర్ 17వ ప్రపంచ చాంపియన్‌షిప్ షోలో తెలంగాణకు చెందిన 8 మంది సెయిలర్లు అదరగొట్టారు. వివిధ విభాగాల్లో భారత్‌కు 16 పతకాలు సాధించారని తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్, యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు సు హైమ్ షేక్ తెలిపారు.

ఆయన మాట్లాడుతూ సిల్వర్ ఫ్లీట్‌లో చంద్రలేఖ తట్టారి సుంచన్‌కోట జోడీ రజతం సాధించగా, రవికుమార్, బద్రినాథ్ నిరుడు జోడీ 8వ, వినోద్ దండు-మణి నిల్కొండ్ల 11వ, కౌనిక్ వర్ధన్  -హనుమంత్ వధ్యా 20 వ స్థానాల్లో నిలవగా, రవికుమార్ ఒకరేసులో మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పా రు. ఉద్భవ్ స్కూల్ విద్యార్థులు రవికుమార్, చంద్రలేఖ, మణి, నల్లకుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థి వినోద్, బన్సీలాల్‌పేట్ ప్రభు త్వ పాఠశాల విద్యార్థి బద్రినాథ్, గురుకుల విద్యార్థులు రిష్విత, హనుమంత్, కౌనిక్ వర్ధ న్ ఈ విజయాన్నిఅందించారని పేర్కొన్నారు.