కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. లైవ్ అప్‌డేట్స్
14-12-2025 02:56 PM
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల(Gram Panchayat Election) రెండో దశ పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ప్రస్తుతం రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు(Telangana Second phase Panchayat Election Results) కొనసాగుతోంది. కాగా, రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది.
ఇప్పటివరకు నమోదైన ఫలితాలు:
| కాంగ్రెస్ | బీఆర్ఎస్ | బీజేపీ | ఇతరులు |
| 2195 | 1159 | 254 | 617 |




