calender_icon.png 14 December, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డిలో ప్రశాంతంగా ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికలు

14-12-2025 03:09:50 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డిలో అత్యధికంగా 87.81% నమోదు… కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ లో గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు ఆదివారం ఉదయం 7 గంటలకు తీవ్ర చలి కారణంగా మందకోడిగా ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. గాంధారి మండలంలో 72.23%, లింగంపేట్ మండలంలో 82 పాయింట్ 20 శాతం, నాగిరెడ్డిపేట మండలంలో 85.88 శాతం, ఎల్లారెడ్డి మండలంలో 87. 81%శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును స్వచ్ఛగా వినియోగించుకున్న ఓటర్లను అధికారులు అభినందించారు.

కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి.. కాసేపట్లో ఫలితాలు…

రెండవ విడత ఎన్నికలు మధ్యాహ్నం ఒకటి గంటలకు ప్రశాంతంగా ముగియడంతో కౌంటింగ్ కు ఆయా గ్రామ పంచాయతీల వారీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామపంచాయతీలకు ఎన్నికలు పూర్తి అవ్వడంతో కాసేపట్లో పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కౌంటింగ్ కు సంబంధిత అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయగా, కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ పరిశీలించారు. కౌంటింగ్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోవైపు కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో పోలీసు అధికారులు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.

కౌంట్ డౌన్ షురూ.. అభ్యర్థుల్లో నెలకొన్న టెన్షన్….

రెండవ విడత పంచాయతీ ఎన్నికలు భాగంగా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి గాంధారి నాగిరెడ్డిపేట లింగంపేట పిట్లం మహమ్మద్ నగర్ నిజాంసాగర్ మండలాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుండగా పోటీ చేసిన అభ్యర్థులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బ్యాలెట్ పేపర్లలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయో లేదో అనే తీవ్ర ఆందోళనలో అభ్యర్థులు ఉన్నారు.