ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): కోల్ బెల్ట్ ఏరియా రామకృష్ణాపూర్ పట్టణంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) వేడుకలను సింగరేణి అధికారులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక సింగరేణి ఠాగూర్ క్రీడ మైదానంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్(Area General Manager Devender) తెలంగాణ తల్లి, ప్రొపెసర్ జయశంకర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఠాగూర్ క్రీడ మైదానం నుండి మొదలుకొని సూపర్ బజార్, ఆంధ్ర బ్యాంక్ మీదగా రామాలయం తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు జీఎం దేవేందర్ సింగరేణి అధికారులు, కార్మికులతో కలిసి కాగడాతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటులో అమరవీరులైన వీరులను స్మరించు కుంటు స్థూపనికి పూలమాలలను వేసి నివాళులర్పించారు. బిఆర్ఎస్ నాయకులు తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ నాయకులు అమరవీరులైన వీరులను స్మరించుకుంటు స్థూపనికి పూలమాలలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.






