02-06-2025 05:12:00 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం(Telangana State Formation Day) నిర్వహించారు. గ్రామ సెక్రెటరీ మహేశ్వరి(Village Secretary Maheshwari) జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం గుండ్రెడ్డిపల్లి రైతు వేదిక కార్యాలయంలో వ్యవసాయ అధికారి సింధు జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవం చేశారు. యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.