04-12-2025 12:10:19 AM
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఆనాడు శ్రీకాంతా చారి ప్రాణ త్యాగంతోనే తెలంగాణ అగ్ని గుండంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. రాష్ట్ర సాధనకు అమరుడైన శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా బుధవారం ఆదిలాబాద్ లోని ఆయన విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ మేరకు జోగు రామన్న మాట్లాడు తూ... అమరుల త్యాగాలతోనే ప్రత్యేక తెలంగా ణ రాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు. మలిదశ ఉద్యమంలో శ్రీకాంత చారి త్యాగం చిరస్మరనీయంగా నిలిచిపోతుందని అన్నారు. అమరుల త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని పేర్కొన్నారు.
వారి ఆశయాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రా హ్మణ, విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు సామన్ పెళ్లి నరసింహులు, ప్రధాన కార్యదర్శి స్వామి, కోశాధికారి దశరథ్, అశోక్, రవి, నరసింహులు,పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, దాసరి రమేష్,రాజు, ధమ్మపాల్ తదితరులు పాల్గొన్నారు.