తేలని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి
సోషల్ మీడియాలోఫేక్ సందేశాలు
అయోమయంలో కాంగ్రెస్ శ్రేణులు
పొన్నం వెంటే ఉంటున్న రాజేందర్‌రావు
అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ
కరీంనగర్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎం పికపై సస్పెన్స్ కొనసాగుతుండటం.. సోషల్ మీడియాలో రోజుకో ఫేక్ సందేశం వస్తుండటంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అయో మయానికి గురవుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అభ్యర్థిని తేల్చుకోలేకపో తున్నది. కాంగ్రెస్‌కు కంచుకోటలా భావిస్తు న్న ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి విషయంలో నలబై రోజులుగా నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొన్నది. కరీంనగర్ టికెట్ అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి కేటాయిం చిదంటూ శనివారం రాత్రి ఓ ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సంత కం, ముద్రను కూడ చేర్చడం గమనార్హం. ఆ సమయంలో కరీంనగర్ టికెట్ ఆశిస్తున్న మరో నాయకుడు వెలిచాల రాజేందర్‌రావు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలసి వేములవాడ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. నాలు గు రోజులుగా నియోజవర్గాల స్థాయి పార్టీ సన్నాహక సమావేశాలు జరుగుతుండగా రాజేందరరావు ఆ -కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్నారు. ప్రవీణ్‌రెడ్డికి టికెట్ వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడంతో రాజేందర్‌రావుతోపాటు పలువురు నేతలు కూడా దానిపై ఆరా తీసినట్టు తెలిసింది. ఇంకా అభ్యర్థిని ప్రకటించ లేదన్న సందేశం అధిష్ఠానం నుంచి రావడంతో ఉసిరి పీల్చుకున్నారు.
అసెంబ్లీ ఎన్ని కల సమయంలోనూ కరీంనగర్ టికెట్ విషయంలో ఇలాగే జరిగింది. నామినేషన్లు ప్రారంభమైన అనంతరం టికెట్ కేటాయించారు, టికెట్ దక్కించుకున్న అభ్యర్థి సర్దుకునే వరకే టైం అయిపోయింది. పార్లమెంటు విషయంలో కూడా కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహారశైలి అభ్యర్థిపై ప్రభావం పడుతుందని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటు న్నారు. ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయాలని వెలిచాల రాజేందర్‌రావు నిర్ణయించుకున్నారు. ఆ రోజైన అభ్యర్థిని ప్రకటి స్తారా, నామినేషన్ చివరి వరకు సస్పెన్షన్ కొనసాగిస్తారా చూడాలి.
మిగిలేది 10రోజులే..
మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. దీనిపరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలు, 34 మండలాలు ఉన్నాయి. ఇప్పటికీ కాంగ్రె స్ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటించినా మిగిలిన 10 రోజుల్లో అభ్యర్థి ఇన్ని మండలాల్లో ప్రచారం చేయడం కష్ట మే. ఇప్పటికే బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు రెండు విడతల ప్రచారం పూర్తి చేశారు. వెలిచాల రాజేందర్‌రావు పేరును ఖరారు చేశార ని చెప్తున్నా.. అధికారిక ప్రకటన రాలేదు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం చేస్తున్న కొద్దీ ప్రత్యర్థులైన బీఆర్‌ఎస్, బీజేపీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీతో ములాఖత్ అయ్యారని బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ చేతులు కలిపారని బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయి. ఈ విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తిప్పికొడుతున్నా కార్యకర్తల్లో మాత్రం ఆయోమయం నెలకొంది. చివరకు టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపించుకుంటాం అంటూ ప్రచారమైతే మొదలు పెట్టారు. కానీ, ప్రకటన జాప్యంతో కార్యకర్తల్లో ఉత్సాహం సన్నగిల్లుతుందని సీనియర్ నేతలు వాపోతున్నారు.






