18 May, 2026 | 1:00 PM

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

25-08-2024 01:50 PM

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. వంద యుద్ధ విమానాలు, 40 రాకెట్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆత్మరక్షణలో భాగంగా ముందస్తు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. హెజ్ బొల్లా ఇజ్రాయెల్ పై 320 డ్రోన్లతో ప్రతీకార దాడులకు దిగింది. దాడుల దృష్ట్యా ఇజ్రాయెల్ లో 48 గంటల పాటు అత్యయిక పరిస్థితి నెలకొంది. కాల్పుల విరమణ కోసం చర్యలు జరుగుతున్న వేళ పరస్పర దాడులు జరిగాయి. దక్షిణ లెబనాన్‌లోని ఉత్తర మధ్య ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్న హిజ్బుల్లా రాకెట్ లాంచర్లపై తమ యుద్ధ విమానాలు దాడి చేశాయని ఇజ్రాయెల్ తెలిపింది.