2 April, 2026 | 3:38 AM

స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పండి

09-10-2025 12:00 AM

 మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి టౌన్ అక్టోబర్ 8 : కాంగ్రెస్ పార్టీ అలవికాని, ఆచరణ సాధ్యం కాని, అమలు కానీ హామీలు ఇచ్చి బకాయిపడ్డ రూపాయలు ఎన్నో బాకీ కార్డు ద్వారా ఇంటింటికి పంపిణీ చేసి ఎన్నికల నగారా మోగించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బుధవారం పట్టణంలోని 20 వార్డులో వేట గడ్డ లో ఇంటింటికి బాకీ కార్డులను పంపిణీ చేశారు.

బాకీ కార్డులు అందుకున్న మహిళలు, నిరుద్యోగులు,వృద్ధులు అనూహ్యంగా స్పందిస్తూ స్వయంగా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు వివరిస్తూ వారికి బుద్ధి చెబుతామని కె.సి.ఆర్ కు అండగా నిలుస్తామని అన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశచరిత్రలో ఇంతగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డదని ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమములో బి.ఆర్.ఎస్ నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.