09-10-2025 12:00:00 AM
ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్, అక్టోబర్ 8(విజయక్రాంతి): ఓట్ల చోరీ మంచి విధానం కాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, దేవ రకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
మోడీ పాలనలో ప్రజా స్వామ్యం ప్రమాదంలో ఉందని, బిజెపి ప్రభుత్వం వ్యవస్థల ను దుర్వినియోగం చేస్తుందని అన్నారు.ఇప్పటికే లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఓట్ చోరీకి సంబంధించి ఆధారాలు బయటపెట్టిన, ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకుండా బిజెపి కనుసన్నల్లో ఎన్నికల సంఘం పనిచేస్తుందన్నారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు (ఓటు హక్కు ను) కాపాడుకునే ప్రయత్నం కు అందరూ సంతకం చేసి ఓట్ చోరీ వ్యతిరేక కార్యక్రమంలో భాగ్యస్వాములు కావాలని అన్నారు.
ప్రతి గ్రామం నుండి ఓటు చోరీకి వ్యతిరేకంగా గ్రామంలో 100 మందితో సంతకాల సేకరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ...ప్రజాస్వామ్యం లో ఓటు హక్కుకు అత్యంత ప్రాధాన్యత ఉం దని, ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్ర భుత్వాలను నిర్ణయిస్తారని, ఎంతో ప్రాధాన్యత కలిగిన ఓట్ల వ్యవస్థను ఎన్నికల సం ఘం సహకారంతో బిజెపి కలుషితం చేసిందని పేర్కొన్నారు.
స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం బిజెపి చెప్పు చేతల్లో పనిచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాల రాసిందని, 2024 లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర అ సెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలోని మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక లక్ష 250 ఓట్లు దొంగ ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్ గాంధీ ఆధారాలను బయటపెట్టిన, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుండా, ఓట్ చోరిని బయటపెట్టిన రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని, అఫిడవిట్ ఇవ్వాలని ఎన్నికల సంఘంను కోరడం హస్యాస్పదమన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, గ్రం థాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి,ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షులు, కాం గ్రెస్ పార్టీ నాయకులు ఎన్పి వెంకటేష్, కాం గ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కు మార్, తదితరులు పాల్గొన్నారు.