calender_icon.png 12 October, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు ముఖ్య భూమిక పోషించాలి

09-10-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, అక్టోబర్ 8 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు ముఖ్య భూమిక పోషించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్/ ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో రిటర్నింగ్ అధికారుల సమావేశం నిర్వహించి వారి బాధ్యతలపై దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 13 జడ్పిటిసి, 136 ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే జిల్లాలోని 272 గ్రామ పంచాయతీ లకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

అయితే నామినేషన్ల ప్రక్రియ ను వీడియోగ్రఫీ తీయించాలని, నామినేషన్ లో అభ్యర్థి సంతకాలు లేకపోతే, సరైన ధ్రువపత్రాలు జత చేయకపోతే రిటర్నింగ్ అధికారులు గుర్తించి సరి చేయాలని, వీలైనంతవరకు నామినేషన్ తిరస్కరణకు గురి కాకుండా చూడాలని ఆర్ వో లకు కలెక్టర్ సూచించారు. నామినేషన్ వేసేందుకు 100 మీటర్ల దూరంలో కేవలం ఒకే వాహనం వచ్చేందుకు అనుమతి ఉంటుందని, నామినేషన్ వేసే గదిలో ముగ్గురు కంటే ఎక్కువ మంది వెళ్లడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

నామినేషన్ల పరిశీలన, అప్పీలు,ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు, అభ్యర్థుల బీ ఫామ్ తదితర విషయాల గురించి స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వా ర్ క్లుప్తంగా వివరించారు. ఎన్నికల నియమావళి లోని ప్రతి పేజీని ప్రతి అక్షరాన్ని చదువుకొని అనుమానాలను నివృత్తి చేసుకోవాలని ఆర్ వో లకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, అన్ని మండలాల ఆర్వోలుపాల్గొన్నారు.