తెలుగు అకాడమీ చైర్మన్ వెంకటనారాయణకు సన్మానం
కాకతీయ యూనివర్సిటీ, మే 10(విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత అధ్యాపకుల సంఘం కార్యవర్గ సభ్యులు ఆచార్య కె. వెంకటనారాయణ, తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ గా నియమితులైన సందర్బంగా కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత అధ్యాపకుల సంఘం బాధ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత అధ్యాపకుల తరఫున ఆచార్య వెంకటనారాయణకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసి, ఆయన నూతన బాధ్యతల్లో విశేష విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా విశ్రాంత అధ్యాపకుల సంఘం అధ్యక్షులు ఆచార్య ఎ. సదానందం మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న ఉపాధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ స్థాయిలలో ఇంగ్లీష్ మాధ్యమ పాఠ్యపుస్తకాల ప్రచురణకు తెలంగాణ తెలుగు అకాడమీ ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆచార్య వెంకటనారాయణను కోరారు.






