11 May, 2026 | 3:55 AM

బెంగాల్ సీన్ రిపీట్ అవుతుంది: ఎంపీ ఈటల రాజేందర్

11-05-2026 02:30 AM

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బెంగాల్ సీన్ రిపీట్ అవుతుందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల సందర్భంగా మోదీ ర్యాలీని మల్కాజిగిరి నుంచే ప్రారంభించారని, ప్రజలంతా మేమున్నాం మీరు ముందుకు సాగండి అని చెప్పి గెలిపించారని గుర్తు చేశారు. దేశం అఖండ భారత్‌గా ఉండాలంటే మోదీ ఉండాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, అందుకే బెంగాల్ ప్రజలు కూడా పట్టం కట్టారని స్పష్టం చేశారు.

రేవంత్ సర్కార్‌ను ప్రజలు మరిచిపోయింద ని  హామీల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. భూమి కనిపిస్తే  అ మ్మడం దోచుకోవడం.. డిల్లీకి పంపడం పని గా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని,  బ య టటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమన్నారు. మోదీ తెలంగాణకు వస్తుంటే ఎందుకు వస్తున్నావని గతంలో కేసీఆర్ విమర్శిస్తే ఆయన్ను ప్రజ లు ఫామ్ హౌజ్‌కే పరిమితం చేశారన్నారు.