28 July, 2026 | 2:25 AM

తెలుగు నా మదర్ ఇండస్ట్రీ

28-07-2026 01:35 AM

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రితిక నాయక్ చెప్పిన చిత్ర విశేషాలు ఆమె మాటల్లోనే.. “-ఈ సినిమాలో నేను సెల్ఫ్ ఇండిపెండెంట్, చాలా మోడరన్ అమ్మాయిగా కనిపిస్తా. చాలా మోడరన్ క్యారెక్టర్. 

ఈ కథ విన్నప్పుడు కొరియా వెళ్లడం నన్ను మొదట ఆకట్టుకుంది. ఎందుకంటే నాకు కొరియన్ కల్చర్, అక్కడి సినిమాలు, కొరియన్ డ్రామాలు అంటే చాలా ఇష్టం. ఈ పాత్రకు, నా వ్యక్తిత్వానికి కొన్ని పోలికలున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ పాత్రకు బాగా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నా. అనంతపురం, కజకిస్థాన్, కొరియా.. మొత్తం షూటింగ్ జర్నీ చాలా జ్ఞాపకాలను ఇచ్చింది. -వరుణ్ తేజ్ వృత్తి పట్ల ఎంతో అంకిత భావంతో ఉంటారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం కలిగింది.

నాకు చాలా ఓపిక ఉంది. మంచి స్క్రిప్ట్ కోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తా. ఒక పాత్రకు నేను వంద శాతం న్యాయం చేయగలనని అనిపిస్తేనే అంగీకరిస్తా. అవకాశం వస్తే తప్పకుండా అన్ని భాషల్లో పనిచేయాలని ఉంది. కానీ తెలుగుకే నా మొదటి ప్రాధాన్యత. ఎందుకంటే ఇది నా మదర్ ఇండస్ట్రీ. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, ‘మిరాయ్’, ‘హాయ్ నాన్న’.. నేను చేసిన ప్రతి సినిమానూ ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. -ప్రస్తుతం చేస్తున్న ఒక తెలుగు ప్రాజెక్ట్ గురించి త్వరలోనే ప్రకటిస్తారు. ‘మిరాయ్2’ -ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది”.