11-02-2026 01:42:00 AM
మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. రోషన్ కథానాయకుడిగా నటించిన ‘ఛాంపియన్’ సినిమాలో ఆయన సరసన కథానాయకిగా తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ తొలి ప్రాజెక్టుతోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయం, సహజ సిద్ధమైన నటనతో యువత మనసు దోచుకున్న అనస్వర.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారి, హవా సాగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. యంగ్ హీరో సంగీత్ శోభన్ సరసన నటించేందుకు అనస్వర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
‘కుమారి 21ఎఫ్’ వంటి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన దర్శకుడు సూర్యప్రతాప్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో రాబోతున్న సినీవర్గాల సమాచారం. వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగీత్ శోభ న్, అనస్వర రాజన్‌ల క్రేజీ కాంబినేషన్ బిగ్‌స్క్రీన్‌పై ఎలా ఉండబోతుందోననే ఆసక్తి సినీ ప్రియుల్లో అప్పుడే మొదలైంది. ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం.