5 June, 2026 | 5:44 PM

Breaking News

ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •   ఘనంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు   •   ఎన్ఎంఎంఎస్ లో ప్రతిభ చూపిన గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు   •  

తెలుగు టైటాన్స్ విజయం

29-11-2024 12:00 AM

పీకేఎల్ 11వ సీజన్

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో నోయిడా వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 41-35 తేడాతో యు ముంబాపై విజయం సాధించింది. టైటాన్స్ జట్టులో  ఆశిష్ నర్వాల్, కెప్టెన్ విజయ్ మాలిక్  చెరో సూపర్ టెన్‌తో మెరిశారు. యు ముంబా తరఫున అజిత్ చౌహాన్ (6 పాయింట్లు) ఒక్కడే పర్వాలేదనిపించాడు.

యూపీ యోధాస్ ఏడో విజయాన్ని నమోదు చేసుకుంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 33-29 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపు సాధించింది. యూపీ తరఫున రెయిడర్ భవానీ రాజ్‌పుత్ 8 పాయింట్లు, గగన్ గౌడ 6 పాయింట్లు సాధించారు. ఇక జైపూర్ తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 6 పాయింట్లు సాధించాడు.

ఈ విజయంతో యూపీ యోధాస్ (14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకోగా.. జైపూర్ 8వ స్థానానికి పడిపోయింది. నేటి మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో హర్యానా, గుజరాత్‌తో పునేరి పల్టన్ తలపడనున్నాయి.