5 August, 2026 | 9:06 PM

భార్య మృతిని తట్టుకోలేక యువ రైతు ఆత్మహత్య

05-08-2026 08:02 PM

దోమకొండ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూర్ గ్రామానికి చెందిన యువ రైతు జోగిని సందీప్ (26) తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల కుటుంబ కలహాల నేపథ్యంలో అతని భార్య మౌనిక ఆత్మహత్య చేసుకోగా, అప్పటి నుంచి సందీప్ తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున భార్య ఆత్మహత్య చేసుకున్న అదే గదిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. సమాచారం అందుకున్న దోమకొండ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి జోగిని నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.