17 April, 2026 | 2:29 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

రెండవ రోజు రేణుక మాత ఆలయం వద్ద ప్రత్యేక పూజలు

25-10-2025 06:23 PM

పొచ్చమ్మ ప్రతిష్టాపన ఆలయ మహోత్సవ ఉత్సవాలు

హోమం నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులు,గౌడ సంఘం సభ్యులు

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని–చింతల పొచ్చమ్మ ప్రతిష్టాపన ఆలయ మహోత్సవ ఉత్సవాలు రెండో రోజు (శనివారం) కొనసాగుతున్నాయి. గణపతి హోమం, శాంతి హోమం, నిత్యపూజ, జపాహోమధులు సపరివార ఎల్లమ్మ తల్లి, చింతల పోచ్చమ్మ తల్లి మూల మంత్ర హవనములు, ప్రదోష పూజ వేద పండితుల ఆధ్వర్యంలో ప్రారంభం అయ్యాయి. ఈ పూజ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.