calender_icon.png 26 October, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకుసాపూర్‌లో పశువైద్య శిబిరం

25-10-2025 06:24:34 PM

80 మంది రైతులకు లబ్ధి..

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో శ్రీమన్నారాయణ వికాస తరంగిణి సిరిసిల్ల శాఖ మరియు కరీంనగర్ డెయిరీ వారి ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో పశువుల గర్భకోశ వ్యాధి, ఇతర వ్యాధులకు చికిత్స అందించడంతో పాటు, అవసరమైన మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. వికాస తరంగిణి వారు ₹3,000 విలువైన మందులు, కరీంనగర్ డెయిరీ వారు ₹7,000 విలువైన మందులను 50% సబ్సిడీపై రైతులకు అందించారు. 

ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణామాచారి, డాక్టర్ ప్రేమాకుమార్, ఎంసిసి-అగ్రహారం మేనేజర్ గట్టు రవీందర్, రూట్ సూపర్వైజర్లు గుర్రం సతీష్ రెడ్డి, ఉమ్మారెడ్డి భానుచందర్ రెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్లు మహేష్, సాగర్, రజిని, అలాగే అంకుసాపూర్ గ్రామ ప్రెసిడెంట్ రోడ్ల ఎల్లారెడ్డి, సెక్రటరీ కదూడూరి శ్రీనివాస్ రెడ్డి, టెస్టర్ రాజు, డైరెక్టర్లు పాల్గొన్నారు. మొత్తం 80 మంది రైతులు ఈ శిబిరం ద్వారా లబ్ధి పొందారు.