4 రోజుల్లో రూ.10.29 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, జూన్ 18: స్టాక్ మార్కెట్ దుందుడుకు ర్యాలీ కొనసాగుతున్నది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, ద్రవ్యోల్బ ణం తగ్గుదలతో రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఆశలు, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వృద్ధికి ఊతమిచ్చే ప్రతిపాదనలు ఉంటాయన్న అంచనాలు తదితర అంశాలతో వరు సగా నాలుగో రోజు మార్కెట్ కొత్త రికార్డులను సృష్టించింది. రెండు ప్రధాన స్టాక్ సూచీలు కొత్త రికార్డుస్థాయిల వద్ద ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 374 పాయింట్లు ఎగిసి 77,367 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు 308 పాయి ంట్ల లాభంతో 77,301 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 113 పాయింట్లు ర్యాలీ జరిపి 23,579 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు 92 పాయింట్ల లాభంతో కీలకమైన 23,500 పాయింట్ల ఎగువన 23,558 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ స్థాయిల్లో సూచీలు ముగియ డం ఇదే ప్రధమం. మంగళవారం నాటి ర్యాలీతో స్టాక్ సూచీలతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్ విలువలో కూడా రూ. 437.24 లక్షల కోట్లకు చేరి మరో సరికొత్త రికార్డుస్థాయిని నమోదు చేసింది.
బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,37,24,261 కోట్లకు (5.24 ట్రిలియన్ డాలర్లు) పెరిగింది. దీంతో వరుస నాలుగు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.10.24 లక్షల కోట్ల మేర ఎగిసింది. రియల్టీ, కన్జూమర్ డ్యూరబుల్, యుటిలిటీ షేర్లకు డిమాండ్ ఏర్పడిందని, బ్లూచిప్ షేర్లు ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు సూచీలను కొత్త రికార్డు స్థాయిలకు చేర్చాయని ట్రేడర్లు తెలిపారు. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘైలు పెరగ్గా, హాంకాంగ్ తగ్గింది. యూ రప్ సూచీలు స్వల్పలాభాలతో ముగిసాయి.
బడ్జెట్‌పై అంచనాలు
వచ్చే కేంద్ర బడ్జెట్లో వృద్ధి, ప్రజాకర్షక పథకాలను సమతౌల్యం చేస్తూ ప్రతిపాదనలు ఉంటాయన్న అంచనాలకు అనుగుణంగా మార్కెట్ స్పందిస్తున్నదని, క్రమేపీ లాభాల్ని పెంచుకుంటున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అలాగే గ్లోబల్ మార్కెట్ ట్రెండ్‌లోని సానుకూల సంకేతాల్ని దేశీయ సూచీ లు అందిపుచ్చుకుంటున్నాయని, గత కొద్ది రోజులుగా మార్కెట్లో ఒడిదుడుకులు తగ్గడమూ మార్కెట్ పెరుగుదలకు కారణ మయ్యిందని వివరించారు.
యూఎస్ మార్కెట్లు ఆల్‌టైమ్ హైకి పెరగడం, అడ్వాన్సు పన్నువసూళ్లు 27 శాతం వృద్ధి చెందాయన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు మద్దతుగా నిలుస్తున్నాయని మోతీ లాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా చెప్పారు. పాజిటివ్ గ్లోబల్ సంకేతాలు, దేశీయ ఆర్థికాంశాల పటిష్ఠత, రానున్న బడ్జెట్లో ప్రభుత్వం మౌలిక వ్యయాలు పెంచుతుందన్న అంచనాలతో ఈక్విటీల్లో మూమెంటం కొనసాగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు ఖెమ్కా చెప్పారు.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు రెండు రోజుల్లో రూ.4,700 కోట్లు
జూన్ తొలి రెండు వారాల్లో వరుస అమ్మకాలు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) తిరిగి కొనుగోళ్లకు ఉపక్రమిం చారు. శుక్రవారం రూ.2,176 కోట్ల నిధుల్ని మార్కెట్లో పెట్టుబడి చేసిన ఎఫ్‌పీఐలు తిరిగి మంగళవారం మరో రూ. 2,569 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరిపినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నారు.






