4 September, 2026 | 6:08 AM

పదేళ్ల పాలన వర్సెస్ వెయ్యి రోజుల ప్రజాపాలన

04-09-2026 | 04:55am
  1. మండల కేంద్రంలో అధికార ప్రతిపక్ష  తోపులాట
  2. అస్వస్థతకు గురైన డీఎస్‌పీ రమణ రెడ్డి
  3. మేముచేశామంటే మేమే బాగు చేస్తున్నామంటూ నినాదాలు
  4. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల ఘర్షణ.. ఉద్రిక్తత వాతావరణం  

చిన్నచింత కుంట, సెప్టెంబర్ 3 : మేము బాగు చేశాం.. కాదు కాదు మేమే బాగు చేశాం.. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు 1000 రోజుల  ప్రజా పాలన అంటూ కాంగ్రెస్ సంబరాలు చేస్తుంటే.. అసలు వెయ్యి అబద్ధాలు చెప్పి గాడి తప్పిన పాలన చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ బిఆర్‌ఎస్ నేతలు (BRS leaders) ఓవైపు నిరసనలు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎవరి నిరసనలు ఎవరి సంబరాలు అద్భుతంగా జరుగుతున్నప్పటికీ ఆశించిన మేరకు మైలేజ్ మాత్రం ఎవ్వరికి రాలేదని తెలుస్తుంది.

సీసీ కుంట మండల పరిధిలో ఒకేరోజు ఇరు పార్టీలు సంబరాలు చేసుకునేందుకు వేదిక కావడంతో ఇరు పార్టీల నేతలు ర్యాలీలు నిర్వహించారు. దీంతో మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర ఇరు పార్టీల నేతలు ఒక్కసారిగా కలవడంతో తోపులాట వాతావరణం చోటుచేసుకుంది. ట్రాఫిక్ రద్దీ ఏర్పడడంతో పాటు కార్యకర్తలు ఒకరిపై ఒకరు తోచుకోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రజా పాలన చేసిన అభివృద్ధి ఓవైపు ఏర్పాటుచేసిన సభలో తెలియజేశారు.

మరోవైపు గత పదిల కాలంలో అద్భుతమైన పరిపాలన అందించమంటూ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అధికార ప్రతిపక్ష పార్టీల సమావేశాలు ప్రజలకు పలు విషయాలు తెలియజేసేందుకు ప్రయత్నించగా జరిగిన ఆందోళనలతో కేవలం ఆందోళనలే ప్రజల దరికి చేరాయి.

ఈ ఘర్షణ వాతావరణం లో నిలుపుదల చేసినందుకు డిఎస్పి రమణారెడ్డి ప్రయత్నించగా తోపులాటలో ఒక్కసారిగా కింద పడిపోవడంతో అస్వస్థకు గురయ్యారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా శాంతియుతంగా సభలు సమా వేశాలు ర్యాలీలు నిర్వహించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.