calender_icon.png 25 July, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్దీపకం-2 పుస్తకాల ముద్రణకు టెండర్లు

26-06-2025 07:56:18 PM

ఐటీడీఏ పీవో రాహుల్..

భద్రాచలం (విజయక్రాంతి): గిరిజన బాల బాలికలకు పునాది నుండి విద్యాభ్యాసం మెరుగుపరచి, వారిలో నైపుణ్యాలు, ప్రతిభను పెంపొందించడానికి గిరిజన ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలలోనీ గిరిజన విద్యార్థులకు ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు (ఉద్దీపకం వర్క్ బుక్-2) ముద్రించి సరఫరా చేయటం గాను భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో గల ప్రింటింగ్ ప్రెస్ దారుల నుండి స్వల్పకాలిక టెండర్లు కోరుతున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పాఠశాలల్లో సుమారుగా 13,206 మంది విద్యార్థులకు 30,89,784 పేజీలను ముద్రించి సరఫరా చేయవలసి ఉంటుందన్నారు. 

కావున ఆసక్తిగల ప్రింటింగ్ దారులు షార్ట్ టెండర్ ఫారాలను డిడి (టి డబ్ల్యూ) కార్యాలయం, ఐటీడీఏ, భద్రాచలం నుండి తగిన రుసుము డిడి రూపంలో చెల్లించి పొందవలసిందిగా ఆయన కోరుచూ, ఇట్టి టెండర్ ఫారంలను ఈనెల 28వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు సమర్పించాలని, సాయంత్రం ఐదు గంటలకు ఐటీడీఏ భద్రాచలం కార్యాలయంలో టెండర్ నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. పూర్తి వివరములకు ఉపసంచాలకులు (గి, సం, శాఖ) ఐటీడీఏ భద్రాచలం వారి కార్యాలయం ఫోన్ నెంబర్లు 970 1315526, 9182861609 ద్వారా తెలుసుకోవాలని ఆయన కోరారు.