25-07-2025 09:48:01 AM
హైదరాబాద్: ప్రముఖ కంటి వైద్యుడు నారాయణరావుకు సైబర్ బెదిరింపులు ఎదురయ్యాయి. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి(Judge of Telangana High Court) జస్టిస్ నగేష్ భీమపాక బాగు సైబర్ బెదిరింపులు వచ్చాయి. బెంగళూరులో మీపై 17 కేసులు నమోదయ్యాయని సైబర్ మోసగాళ్లు బెదిరించారు. డాక్టర్ క్లినిక్ లో ఉన్న సమయంలో బెంగళూరు నుంచి పోలీసుల పేరుతో వీడియో కాల్ చేశారు. మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందని.. బెంగళూరు వచ్చి పోలీసుల ముందు హాజరుకావాలని హెచ్చరించారు. తలుపులు, కిటికీలు అన్నీ మూసేసి తమ విచారణలో పాల్గొనాలని సైబర్ నేరగాళ్లు(Cyber criminals) బెదిరించారు. నిన్న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు డిజిటల్ అరెస్ట్ పేరుతో బ్లాక్ మెయిల్ చేశారు. మీ పేరుపై ఉన్న మరో ఫోన్ నెంబర్ తో చట్టవ్యతిరేక పనులు జరిగినట్లు బెదిరించారు.