25-07-2025 10:41:02 AM
హైదరాబాద్: ఇవాళ జరగాల్సిన తెలంగాణ(Telangana Cabinet meeting postponed) మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 28 మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో కేబినెట్ సమావేశం వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, బీసీ మంత్రులు ఢిల్లీలోనే ఉన్న విషయం తెలిసిందే. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ, వాకటి శ్రీహరి ఢిల్లీలోనే ఉన్నారు. బీసీల న్యాయ సమ్మేళనంలో సీఎం, మంత్రులు పాల్గొననున్నారు.