4 March, 2026 | 4:54 PM

వాతావరణ సమతుల్యతకు వన్యప్రాణులు అవసరం

04-03-2026 12:00 AM

జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి ౩ (విజయక్రాంతి): వాతావరణ సమతుల్యతకు వన్య ప్రాణులు ఎంతో అవసరమని జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయ ఆవరణలో ఆసిఫాబాద్ రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్ అధ్యక్షతన నిర్వహించిన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణతో వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుందని అన్నారు.

అడవులు వన్యప్రాణుల రక్షణకు ప్రజలు తమతో కలిసి రావాలని కోరారు. అటవీశాఖ తరఫున వన్యప్రాణుల సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం మాణిక్ గూడా అర్బన్ పార్క్ లో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేష్ కులకర్ణి, ఝాన్సీ రాణి, సెక్షన్ అధికారులు మహేందర్, సాయిచరణ్, సతీష్, బీట్ అధికారులు పాల్గొన్నారు.