17 April, 2026 | 5:36 AM

టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

28-06-2025 01:36 AM

73.35 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల చేసింది. విద్యార్థులు ఈనెల 3 నుంచి 13 వర కు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. 42,834 మంది విద్యార్థులు దరఖా స్తు చేసుకోగా, వీరిలో 38,741 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 28, 415 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 73.35గా నమోదైంది.

బాలురు 71.05 శాతం, బాలికలు 77.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితా ల్లో జనగాం జిల్లా 100 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 55.90 శాతం సాధించి సంగారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రీ కౌంటింగ్ చేయించాలనుకు నే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు రూ. 500, రీ వెరిఫికేషన్‌కు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలి. అందుకు జూలై 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల ని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు విజ్ఞప్తి చేశారు.