2 July, 2026 | 10:46 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

భారత్, పాక్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు!

31-05-2024 01:24 AM

ఖండించిన అమెరికా

న్యూయార్క్: టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్థాన్ మధ్య జూన్ 9న జరగనున్న మ్యాచ్‌కు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు గురువారం వార్తలు రాగా.. ఐసీసీతో పాటు అమెరికా వాటిని ఖండించాయి. ఆ వార్తలు నిజం కాదని న్యూయార్క్ గవర్నింగ్ బాడీ తెలిపింది. భద్రతా విషయంలో మూడెంచెల పటిష్ట బందోబస్తూ ఏర్పాటు చేశామని.. అనుమతి లేకుండా ఎవరిని స్టేడియంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆధునిక టెక్నాలజీ సాయంతో మ్యాచ్ జరగనున్న నాసౌ కౌంటీ స్టేడియం వెలుపల ప్రతీ మూలన నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. న్యూయార్క్ గవర్నర్ కాతీ హోచుల్ మాట్లాడుతూ.. ‘ఉగ్రముప్పు వార్తల్లో నిజం లేదు. ప్రజా భద్రతకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. న్యూయార్క్ వేదికగా జూన్ 3 నుంచి 12 వరకు తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే న్యూయార్క్ స్టేట్ పోలీస్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించాం. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో బందోబస్తు ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు.