2 July, 2026 | 9:42 AM

గాయత్రి జోడీ సంచలనం

31-05-2024 01:27 AM

సింగపూర్: సింగపూర్ ఓపెన్‌లో భారత డబుల్స్ ద్వయం పుల్లెల గాయత్రి గోపీచంద్‌ేొత్రిసా జాలీ సంచలనం నమోదు చేసింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ టోర్నీ మహిళల డబుల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీకి షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జంట 21 14 21 బెక్ జోడీని చిత్తు చేసింది. గంట పాటు సాగిన పోరులో తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన గాయత్రి జోడీ.. రెండో గేమ్‌ను మాత్రం ప్రత్యర్థికి కోల్పోయింది. కానీ మూడో గేమ్‌లో తిరిగి ఫుంజుకున్న ఈ జంట గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. క్వార్టర్స్‌లో గాయత్రి జంట దక్షిణకొరియాకు చెందిన కిమ్ యోంగ్ కోంగ్ హీ ద్వయంతో తలపడనుంది. మరోవైపు తెలుగుతేజం పీవీ సింధు మరోసారి నిరాశపరి చింది. సింగపూర్ ఓపెన్ సూపర్ టోర్నీలో సింధూ ప్రిక్వార్టర్స్‌కే పరిమితమైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సింధు 21 11 20 కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూసింది. మలేషియా మాస్టర్స్ టోర్నీలో ఫైనల్ మెట్టుపై బోల్తా పడిన సింధు.. సింగపూర్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కే పరిమితమైంది.