మస్క్‌కు టెస్లా 56 బిలియన్ డాలర్ల ప్యాకేజి
- షేర్ హోల్డర్ల ఆమోదం
న్యూయార్క్, జూన్ 13: ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌కు 2018వ సంవత్సరానికి 56 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) ప్రోత్సాహక ప్యాకేజీ ఇచ్చేందుకు టెస్లా షేర్‌హోల్డర్లు ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని గురువారం మస్క్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో పోస్టు చేశారు. అమెరికా కార్పొరేట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్యాకేజి. టెస్లా మార్కెట్ విలువ దశాబ్దకాలంలో 650 బిలియన్ డాలర్లకు చేర్చినందుకు మస్క్‌కు ఈ ప్యాకేజి లభించింది. 2018 సంవత్సరానికి గతంలో ప్రతిపాదించిన ఈ ప్యాకేజి పలు న్యాయవివాదాల మధ్య నిలిచిపోయింది. ఇటీవల దానిని డెలవారే కోర్టు ఇన్‌వ్యాలిడ్ చేసింది. దీంతో టెస్లా బోర్డు ప్యాకేజికి మరోసారి షేర్‌హోల్డర్ల అనుమతి కోరింది. తాజా ఓటింగ్ లో సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు ప్యాకేజీకి మద్దతు ప్రకటించారు.






