11 April, 2026 | 12:05 PM

Breaking News

భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •  

18నుంచి టెట్ పరీక్షలు

05-06-2025 12:20 AM
  1. 9 రోజులు 16 సెషన్లు
  2. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)-2025 షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు ఈపరీక్షలు జరగనున్నాయి. నోటిఫికేషన్‌లో జూన్ 15 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నప్పటికీ 18వ తేదీ నుంచి నిర్వహిస్తుండటం గమనార్హం. ఈమేరకు తాజాగా పరీక్షల నిర్వహణ తేదీలు, సబ్జెక్టులు, సెష న్లు, జిల్లాల వివరాలతో పాఠశాల విద్యాశాఖ పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.

మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వర కు, సెషన్ 2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిం దే. మొత్తం 9 రోజులు 16 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. జూన్ 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేలా వీలుకల్పించే అవకాశ ముంది.

రాష్ట్రంలో ఏడాది రెండుసార్లు (జూన్, డిసెంబర్) టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే గతేడా ది డిసెంబర్‌లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం, ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు రెండోసారి నిర్వహిస్తోంది. ఈసారి 1,83,653 దరఖాస్తులు వచ్చాయి.