calender_icon.png 5 August, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో వస్త్ర వ్యాపారి మృతి

04-08-2025 11:36:36 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణానికి చెందిన రెడీమేడ్ వస్త్ర వ్యాపారి గుల్షన్ కుమార్ సహాని గుండెపోటుతో సోమవారం సాయంత్రం మృతి చెందారు. 85 ఏళ్ల గుల్షన్ కుమార్ సహాని బెల్లంపల్లి పట్టణంలో గుల్షన్ రెడీమేడ్ డ్రెస్సెస్ దుకాణాన్ని ఏర్పాటు చేసి ప్రముఖ వస్త్ర వ్యాపారిగా పేరు తెచ్చుకున్నారు. మృతి చెందిన గుల్షన్ కుమార్ సహాని ప్రతీ ఒక్కరికి సుపరిచితుడు. ఆయన మృతి పట్ల వస్త్ర వ్యాపారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.