calender_icon.png 5 August, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖిల్లా డిచ్‌పల్లిలో ఒకరికి డెంగ్యూ పాజిటివ్

05-08-2025 12:00:00 AM

 పడకేసిన పారిశుధ్యం 

 పట్టించుకోని అధికారులు 

డిచ్ పల్లి ఆగస్టు 4 (విజయ క్రాంతి): డిచ్పల్లి మండలం  ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో ని  దూస్ గాం లో నివాసం ఉండే ఒక వ్యక్తికి గత 12 రోజులుగా  చలీ, జ్వరం, విరోచనా లతో అనారోగ్యం బారిన పడ్డారు. డెంగ్యూ వ్యాధిని గుర్తించక  మైలారంలోని ఒక ఆర్ ఎంపి  డాక్టర్ వద్దకు వైద్యంకు వెళ్లి టైపాడ్ జ్వరం అనుకున్నారు. కానీ టైఫాడు కాదు అని తేలడంతో. ఆదివారం జిల్లా కేంద్రం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రోగి పరిస్థితి విషమించడంతో   ఐసియు లో చికిత్స చేర్పించారు.

ఆసుపత్రి వర్గాలు డెంగ్యూ వ్యాధి పాజిటివ్గా దారించారు. రక్త తీసి పరీక్షలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ టి హబ్  ల్యాబ్‌లో పరీక్షలకు రక్త  నమోనా లను పంపారు. గ్రామంలోని పరిసరాలు పరిశుభ్రత  లేక  పారిశుద్ధం పడకేయడంతో, గ్రామంలోని ప్రజలు  ఆరోగ్యానికి గురై డెంగ్యూ వ్యాధి పారిన పడుతున్నారు.

ఆపరిశుభ్రతతో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. దీనికి తోడు దోమలు ఎక్కువై డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. డెంగ్యూ, మలేరియా వ్యాధిపై  గ్రామాల్లో అవగాహన కల్పించి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తే  బాగుంటుందని గ్రామస్తులు కోరుకుతున్నారు.