calender_icon.png 5 August, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత చూపు బీజేపీ వైపు

05-08-2025 12:00:00 AM

జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు ౪ (విజ యక్రాంతి): యువత చూపు బీజేపీ వైపు ఉందని  జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు అన్నారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో  రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన యువకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశ రక్షణ తోపాటు ప్రజా సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవే శ పెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళు సంస్థగా బలోపేతం కావాలని తెలిపా రు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ ,నాయకులు ప్రసాద్ గౌడ్, దీపక్ రావ్,శ్రీకాంత్,మాటూరి జయరాజ్, సొల్లు లక్ష్మి, ఆంజనేయ గాడ్ పాల్గొన్నారు.