27 July, 2026 | 6:32 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

కొనసాగుతున్న టీజీ-20 క్రికెట్ లీగ్ మోగా వేలం

07-06-2026 12:09 PM

హైదరాబాద్: తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ-20 క్రికెట్ లీగ్ మోగా వేలం ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా కొనసాగుతుంది. క్రికెట్ ఆటగాళ్ల వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. ప్రముఖ వ్యాఖ్యాత చారు శర్మ అధ్యక్షతన  నిర్వహిస్తున్న ఈ మెగా వేలానికి తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన 1300 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 20 మంది క్రికెటర్లను ఎంచుకోనందని, ఆటగాళ్ల కొనుగోలుకు ఒక్కో జట్టు గరిష్ఠంగా రూ.60 లక్షలు వెచ్చించనుంది. ఒక్కో జట్టు కనీసం రూ.54 లక్షలు ఖర్చు చేయాలని నిబంధన, ఆటగాళ్లను ఏ ప్లస్, ఏ,బీ,సీ1, సీ2 విభాగాలుగా వర్గీకరణ చేశారు.  

మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ఈ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీజీ-20 అరంగేట్ర సీజన్ ఈనెల 21న ప్రారంభం కానుంది. టీజీ-20 క్రికెట్ లీగ్ లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్, మెదక్ ఫాల్కన్స్, అనురాగ్ నల్గొండ నైట్స్, కరీంనగర్ డైమండ్స్, పాలమూరు స్ట్రయికర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు పాల్గొంటున్నాయి.