calender_icon.png 11 November, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలకు ప్రోత్సాహం – బ్యాట్ స్వింగ్‌తో ఆకట్టుకున్న టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

11-11-2025 03:30:37 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): క్రీడలతో ఆరోగ్యం సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బాక్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడల ప్రాధాన్యతను తెలియజేస్తూ నిర్మల జగ్గారెడ్డి క్రికెట్ బ్యాట్ పట్టి స్వయంగా షాట్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, విద్యార్థులను ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రీడాకారులు గెలుపు, ఓటమి గురించి ఆలోచించకుండా నిరంతరం ముందుకు సాగాలని, క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం పెరుగుతుందని చెప్పారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు మొబైల్‌ ఫోన్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని, చదువుతో పాటు క్రీడలకు కూడా సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అధ్యక్షుడు బంగారు కృష్ణ, తోపాజీ అనంత కిషన్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, చింతల సాయి కుమార్, భాను ప్రసాద్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.