4 March, 2026 | 10:46 PM

పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

04-03-2026 09:38 PM

చిట్యాల,(విజయ క్రాంతి):  చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఫిజికల్ డైరెక్టర్ గా ఉద్యోగ విరమణ చేసిన చింతల బ్రహ్మయ్య సన్మాన మహోత్సవము అంగరంగ వైభవంగా విద్యార్థులు నిర్వహించారు. గత 24 సంవత్సరాలుగా విద్యారంగంలో విశిష్ట సేవలను అందించి ఉద్యోగ విరమణ చేసిన బ్రహ్మయ్య పెద్ద కాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 8 సంవత్సరాలుగా ఫిజికల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తూ,

క్రమశిక్షణకు మారుపేరుగా విద్యార్థులను చైతన్య పరుస్తూ నేషనల్ స్థాయి నుండి జిల్లాస్థాయి వరకు పెద్దకాపర్తి విద్యార్థులను క్రీడారంగంలో ముందుకు తీసుకెళ్లారు. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులతో పాటు తాను ఒక విద్యార్థిగా ఉంటూ సాంస్కృతిక కళా పోషణలో విద్యార్థులను ముందడుగులో ఉంచి, విద్యార్థులను తీర్చిదిద్దిన ఆయన పాఠశాలను వదిలి వెళ్లడం బాధాకరమని సీనియర్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ మాట్లాడుతూ భావోద్వేగాలయ్యారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటo వెంకటేశం,  వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకుడు, మాజీ సర్పంచులు మర్రి జలంధర్ రెడ్డి, కందిమల్ల శిశుపాల్ రెడ్డి, కామినేని దుర్గాకుమార్, తాటి చంద్రమౌళి, ఆవుల జానయ్య, నీలకంఠం నరేష్, చేకూరి గణేష్, ఏర్పుల నరసింహ, జెల్లా ప్రశాంత్, ఏర్పుల యాదయ్య, హరీష్ రెడ్డి, గుండెబోయిననరసింహ, ఉపాధ్యాయులు లుకేందర్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, కైలాసం, లచ్చిరెడ్డి యశోదర, విజయలక్ష్మి, యాదగిరి రెడ్డి, రాధా, రవీందర్, వెంకటేశం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.