11-11-2025 03:27:53 PM
సిద్దిపేట క్రైమ్: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) టెక్నాలజీతో ద్వారా గుర్తించి బాధితులకు అప్పగించినట్టు సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపారు. బాధితులు కడమంచి కవిత, ముద్రతి చరణ్, లక్ష్మి, రవి ప్రసాద్, షాదుల్లా పట్టణంలో నెల రోజుల క్రితం ఫోన్లు పోగొట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వివరాలు నమోదు చేసుకొని ఫోన్లను గుర్తించి బాధితులకు అందించారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా, గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినా సీఈఐఆర్ పోర్టల్లో ఫోన్ వివరాలు నమోదు చేసుకున్నట్టైతే ఫోన్ ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపారు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనవద్దని సూచించారు.