11-11-2025 03:34:03 PM
ఖానాపూర్ ఎంపీడీవో రమాకాంత్
ఖానాపూర్ (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో వేగం పెంచాలని త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని ఖానాపూర్ ఎంపీడీవో రమాకాంత్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి మండలంలోని దాసు నాయక్ తండా, పంగిడిగూడెం, రాజుర, సింగాపూర్, బాదనకుర్తి, తదితర గ్రామాలను సందర్శించి ఇండ్ల నిర్మాణాల పనులను పరిశీలించారు. నిర్మాణం పనులలో అలసత్వం వద్దని వెంటనే ప్రభుత్వం బిల్లులు కూడా ఇస్తున్నందున పనులలో వేగం పెంచాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఎంపీఓ, సిహెచ్ రత్నాకర్ రావు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.