3 May, 2026 | 2:32 AM

ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర.. అసెంబ్లీలో గళమెత్తుతాం: హరీశ్ రావు

12-03-2026 04:41 PM

ఆర్టీసీ కార్మికుల పక్షాన అసెంబ్లీలో గళమెత్తుతాం

హైదరాబాద్: టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (TGSRTC Joint Action Committee) నాయకులు మాజీ మంత్రి హరీశ్ రావును(Former Minister Harish Rao) కలిసి, ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పక్షాన అంసెబ్లీలో గళమెత్తుతామని హామీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రవేటీకరించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని అప్పుల కుప్ప చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఒక్కో విభాగాన్ని ప్రైవేటీకరించే కుట్రలు చేస్తోందన్నారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని హరీశ్ రావు పేర్కొన్నారు.