16 April, 2026 | 8:48 AM

తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు

02-06-2025 02:15 AM
  1. హైదరాబాద్ అనుభవం మరపురానిది
  2. అవకాశం వస్తే మళ్లీ వస్తా
  3. మిస్ వరల్డ్ విజేత ఒపెల్ సుచాత 

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): మిస్ వరల్డ్ పోటీలకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి మిస్ వరల్డ్ విజేత ఒపెల్ సుచాత కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ఎంతో అందమైన నగరమని, ఇక్కడ ప్రజలు ఎంతో స్నేహాపూర్వకంగా ఉన్నారని అన్నా రు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంత అద్భుతమైన అ నుభవం పొందడం తన జీవితంలో మరపురాని మధుర జ్ఞాపకం అన్నారు.

థాయి లాండ్ తరుఫున ఇది మొట్టమొదటి మిస్ వరల్డ్ కిరీటం గెల్చుకోవడం తనకు గర్వకారణంగా ఉన్నదని చెప్పారు. ఇది ప్రతి ఒక్క పోటీదారు గెలుపు అని ఆమె చెప్పారు. బ్యూటీ విత్ పర్పస్ సేవా కార్యక్రమాలు ప్ర పంచ వ్యాప్తంగా విస్తరిస్తానని సుచాత ప్రకటించారు. గత మూడేళ్లుగా ధాయిలాండ్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహాన కల్పిస్తున్నానని ఆమె తెలిపారు.

దీనిపై ఫండ్ రైజింగ్ చేస్తున్నానని, ఇకపై తాను పర్పస్ ప్రాజెక్టుతో ఆటు ఇతర కంటెస్టెంట్స్ పర్పస్ ప్రాజెక్టుపై పని చేస్తానన్నారు. హైదరాబాద్‌లో గడిపిన ప్రతి క్షణం తనకు మరచిపోలేని అనుభవం అన్నారు. అవకాశం వస్తే మళ్లీ హైదరాబాద్‌కు వస్తానని సుచాత తెలిపారు.